Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెహదీపట్నం
మెహిదీపట్నంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఆన్ కట్ ఆభరణాల ప్రదర్శనను ఆ సంస్థ డైరెక్టర్ రమీజ్ ఆధ్వర్యంలో సంస్థ వినియోగదారుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రమీజ్ మాట్లాడుతూ నవంబర్ 7వ తేదీ వరకు ఈప్రదర్శన కొనసాగుతుందని తెలిపారు. ఈషోలో ఏరా ఆన్ కట్ వజ్రాలతో పొదిగిన విశిష్ట శ్రేణి నగలను అందిస్తున్నట్లు తెలిపారు. దసరా దీపావళి పండుగ సందర్భంగా మలబార్ సంస్థ ఇస్తున్న ప్రత్యేకమైన ఆఫర్ల లో భాగంగా రూ. 50వేలు, అంతకంటే ఎక్కువ విలువైన వజ్రాభరణాల కొనుగోలుతో ఒక బంగారు నాణెంను ఉచితంగా, ధన త్రయోదశి పర్వదినం సందర్భంగా బంగారాన్ని ముందుగా బుక్ చేసుకునే వరకు ఒక వెండి నాణెం ను ఉచితంగా ఇస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు.