Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుల ఆధారిత జనగణన జరపాలని కేబినెట్ తీర్మానం చేయడంపై జాతీయ ఓబీసీ హక్కుల పరిరక్షణ ఫోరం అధ్యక్షులు ఆళ్ల రామకష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. వెనకబడిన తరగతుల కలను సాకారం చేసిన సీఎం వై.ఎస్ జగన్మోహన్ రెడ్డికి కతజ్ఞతలు తెలిపారు. బీసీ కుల ఆధారిత జనగణన కోసం విశేషంగా కషి చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మెన్ అంబటి శంకర్ నారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ లెజిస్లేచర్ కమిటీ చైర్మన్ జంగా కష్ణమూర్తిలకు కతజ్ఞతలు తెలిపారు. 2014లో తొలగించిన ఉత్తరాంధ్రకు చెందిన 26 బీసీ కులాలను తెలంగాణ బీసీ జాబితాలో తిరిగి చేర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు.