Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
నాగర్కర్నూల్లో జరిగిన సర్వ సభ సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం చిలకలగూడ గాంధీ విగ్రహం వద్ద ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా వైఎస్సార్ టీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కేఎస్ శిల్పాచారి మాట్లాడుతూ తెలంగాణలోని నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం వైఎస్ షర్మిల దీక్ష చేస్తుంటే నోటిఫికేషన్లు వేయడం చేతకాని నిరంజన్ రెడ్డిలాంటి మంత్రులకు ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసే అర్హత లేదన్నారు. ఏదైనా మాట్లాడే ముందు ఫస్టు మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని మంత్రికి హితవు పలికారు. కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు.