Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నిన టీఆర్ఎస్ దే గెలుపు ఖాయమని ఆపార్టీ ఎస్సీ సెల్ మాజీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు సి.సంజరు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులు ఆర్థికంగా బలపడాలని హుజూరాబాద్ లో దళిత బంధు పథకం ప్రవేశపెట్టితే దాన్ని ఎన్నికల సాకుతో అపాలంటూ బీజేపీ నేతలు లేఖ రాసి ఆపించారని ఆరోపించారు. దళితుల అభివద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు కషి చేస్తుందన్నారు. ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలవడం ఖాయమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.