Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
పార్క్‌ల అభివృద్ధికి కృషి చేస్తానని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. గోల్నాక డివిజన్ పరిధిలోని కృష్ణానగర్‌లో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన పార్క్‌ను శుక్రవారం సందర్శించారు. ఈసందర్భంగా పార్క్ ముందు ఆర్చ్, ప్రహరీ నిర్మాణం, చుట్టూ ఫెన్సింగ్, విభిన్న రకాల పూల మొక్కలను నాటడం, జిమ్ ఏర్పాటు తదితర అంశాలపై అధికారులు, స్థానికులతో చర్చించారు. కార్యక్రమంలో డీఈ సుధాకర్, ఏఈ ఫరీద్, కాంట్రాక్టర్ నరేందర్, బస్తీ వాసులు మహేందర్, యాదగిరి, కె స్వామి, చంద్రమౌళి, సాయి, సుబ్బారావు, అనిల్, ఎన్ స్వామి, ప్రవీణ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.