Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఎన్నో ఏండ్లుగా యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కార్మికులను తొలగించడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులంతా శుక్రవారం ఆర్ట్స్ కళాశాల ఎదుట భిక్షాటన చేస్తూ నాన్ లోకల్ గో బ్యాక్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. తమపై వీసీ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు విధించినా తమ పోరాటం కొనసాగుతుందని కార్మికులు స్పష్టంచేశారు. అనంతరం నిరసన వ్యక్తంచేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో విద్యార్థి సంఘ నాయకులు కాంపల్లి శ్రీనివాస్, కార్మికులు నరసింహారెడ్డి, ఐలయ్య, మురళి, సుదర్శన్ రెడ్డి ఉన్నారు.