Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
వికలాంగులకు కేవలం పెన్షన్లు ఇస్తే సరిపోదని ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శ్రీత్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదిక పై శుక్రవారం ఎబిలిటీ కల్చరల్ ఫెస్టివల్ 2021 నిర్వహించారు. నాగేశ్వర రావు మాట్లాడుతూ వికలాంగులకు రాజకీయ కోటా కేటాయించాలన్నారు. బీజేపీ బీసీ సెల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ వికలాంగుల హక్కుల కోసం మరో ఉద్య మానికి సమాయత్తం కావాలని కోరారు. ప్రధాని మోడీ 2016లో తెచ్చిన వికలాంగుల హక్కుల చట్టం రాష్ట్రంలో అమలు చేయాలని, వివిధ ప్రభుత్వ శాఖల్లో వికలాంగులకు కేటాయించిన కోటా ను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక కార్పొరేటర్ పావని వినయ కుమార్, వికలాంగుల నాయకులు మహంకాళి రవీందర్, గోవింద్ గోపాలకష్ణ, ఉమాలక్ష్మి, పూసరాజు సంజరు తదితరులు పాల్గొన్నారు. ఆకతి ఆశ్రయి స్వచ్చంద సంస్థ 35 మంది వికలాంగులకు నిత్యావసర సరుకులు సంస్థ ప్రతినిధి భీమా రెడ్డి పంపిణీ చేశారు.