Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మణిపూర్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య టి. తిరుపతి రావు
నవతెలంగాణ-కల్చరల్
నేడు సాంకేతికగా, సామాజికంగా, ఆర్ధికంగా అన్ని రంగాల్లో త్వరితంగా మార్పు జరుగుతోందని వీటిని అవగాహన చేసుకొని భవిష్యత్‌కు మార్గం చూపే విధంగా రచయితలు సాహిత్యాన్ని వెలువరించాలని మణిపూర్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య టి. తిరుపతి రావు సూచించారు. తెలుగు విశ్వవిద్యాలయం లోని ఎన్టీఆర్ కళా మందిరంలో శుక్రవారం విశ్వవిద్యాలయం సాహితీ పురస్కార ప్రదోనోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య తిరుపతి రావు మాట్లాడుతూ సమాజానికి డిక్సూచి సాహితీకారులే నన్నారు. ప్రారంభోపన్యాసం చేసిన ప్రఖ్యాత రచయిత ఆచార్య కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయం ఏ లక్ష్యంతో ప్రారంభించరో ఆ దిశ గా పనిచేస్తోందని అన్నారు. సుప్రసిద్ధ కవి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ పురస్కారాలు రచయితకు ఆక్సిజన్‌లా పనిచేస్తాయన్నారు. అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య కిషన్ రావు మాట్లాడుతూ భవిష్యత్తు లో వైవిధ్య సాహితీకార్యక్రమలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం వివిధ సాహితీ ప్రక్రియలల కషిచేసిన పది మంది సాహితీ ప్రముఖులకు 2018 సంవత్సరానికిగాను నగదు పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమానికి తొలుత మాళవిక, కష్ణ చైతన్య కల్పన లలిత గీతాలను మధురంగా ఆలపించారు. విశ్వవిద్యాలయ అధికారులు మురళి కష్ణ , శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.