Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
మైనింగ్ అధికారుల అనుమతి లేకుండా ఎత్తయిన గుట్టను తొలగించడం, మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల అనుమతి లేకుండా గోడ నిర్మాణ పనులు చేపట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతు నాదర్గుల్ గ్రామ రైతులు శనివారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మరెడ్డి, కమిషనర్ కష్ణ మోహన్రెడ్డిలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు మాజీ నాదర్గుల్ గ్రామ సహకార సంఘం బ్యాంక్ వైఎస్ చైర్మెన్ వెంకట్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న నాదర్గుల్ గ్రామ రెవెన్యూ శివారులో ఉన్న సర్వే నెంబర్.702,703,704,705, 707,708,709,710ల్లో ఉన్న ఎతైన గుట్టను ప్రభుత్వ మైనింగ్ అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా గుట్టను పూర్తిగా తొలగించడం జరిగిందని, అదేవిధంగా అదే ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల అనుమతి లేకుండా ప్రహరీ గోడ నిర్మాణ పనులు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని అయన డిమాండ్ చేశారు. ప్రహరీ గోడ నిర్మాణ పనులు చేపడితే ఆ ప్రాంతం గుండా వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులకు తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిపారు. రైతుల సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రహరీ గోడ నిర్మాణ పనులను నిలిపివేెయాలని కోరారు.