Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సరూర్‌నగర్
అరకు నుండి హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి , 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న సంఘటన సరూర్‌నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సరూర్‌నగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ ప్రకటించిన గంజాయి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణ కార్యాచరణలో భాగంగా శనివారం ఏడు గంటలకు విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా ప్రొహిబిషన్, సరూర్‌నగర్ ఎక్సైజ్ అధికారి టి.రవీందర్ రావు, ఆదేశానుసారము అసిస్టెంట్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి సరూర్‌నగర్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సరూర్‌నగర్ ఎక్సైజ్ స్టేషన్ అధికారులు, సిబ్బంది కలిసి ఎల్బీనగర్ చౌరస్తాలో రూట్ వాచ్ నిర్వహించగా అరకు ప్రాంతం నుంచి హైదరాబాదు ప్రాంతానికి అక్రమంగా ఎండు గంజాయిని రవాణా చేస్తున్న ఇమ్రాన్ అను వ్యక్తి నుంచి మూడు కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది అన్నారు. వ్యక్తిని అరెస్టు చేసి తదుపరి చర్యల నిమిత్తం కోర్టులో హాజపర్చడం జరిగిందన్నారు. ఎండు గంజాయిని అరకులో నాలుగు వేలకు కిలో చొప్పున కొని హైదరాబాదులో 20వేలకు కిలో చొప్పున అమ్ముతున్నారని సరూర్‌నగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మాట్లాడుతు ఎవరైనా నిషిద్ధ్ద పదార్థాలు గంజాయి మరియు డ్రగ్స్‌ని కలిగి ఉన్నా, సరఫరా చేసినా, అమ్మినా తీవ్రంగా చట్టప్రకారం శిక్షలు విధించబడతాయి అని సరూర్‌నగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు గాయత్రి, ముజాహిద్ శుట్టారి, తదితరులు పాల్గొన్నారు.