Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ పద్మ ఐలయ్య యాదవ్
నవతెలంగాణ-బడంగ్పేట్
ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే విద్యార్థులకు ఆరోగ్యంగా ఉండి విద్యలో రాణిస్తారని 2వ డివిజన్ కార్పొరేటర్ జెనిగే పద్మా ఐలయ్య యాదవ్ అన్నారు. శనివారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఆల్మాస్గూడ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ''స్వచ్ఛ పాఠశాల'' కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కార్పొరేటర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మ ఐలయ్య మాట్లాడుతూ ప్రభుత్వ అదేశం మేరకు నిర్వహించే స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం సందర్భంగా పాఠశాల తరగతి గదులను, ప్రాంగణాన్ని శుభ్రం చేయడం జరిగిందన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి, విద్యార్థులకు చక్కని విద్యను అందించి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన భాద్యత వారిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఎం అదష్టరావు, ఉపాధ్యాయులు, డివిజన్ యువజన సంఘ సభ్యులు పాల్గొని కార్యక్రమాని విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు.