Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
చదువుకుంటున్న ఆడపిల్లలకు ఆరోగ్య రక్షణ కిట్లు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆడపిల్లల తల్లుల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు హాస్టల్స్లో విద్యనభ్యసిస్తున్న కిశోర బాలికలకు గత రెండు సంవత్సరాలుగా ఆగిపోయాయని, కరోనా కారణంగా పేద కుటుంబీ కులు వారికే రక్షణ కిట్లను అందివ్వడం భారంగా మారుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నారగొని శ్రీనివాస్ యాదవ్, కష్ణ తల్లుల సంఘం నాయకురాల్లు అనిత, రజియాతో పాటు ఎం.వి.ఎఫ్ వెంకట్ స్వామి, సువర్ణ పాల్గొన్నారు.