Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ప్రభుత్వా న్ని డిమాండ్ చేసింది. ఆ సంఘం కేంద్ర కమిటీ పిలుపు లో భాగంగా శనివారం ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
టి.జ్యోతి, అధ్యక్షులు ఆర్.అరుణ జ్యోతి, హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి పి.శశికళ, జిల్లా నాయకురాలు నాగమణి మహిళల సమస్యలు తెలుసుకోవడానికి స్థానిక రవీంద్ర నాయక్‌నగర్, ఆస్మాన్ఘాట్, గాంధీనగర్, ఆల్ బేలే కాలనీ వివిధ బస్లీలల్లో సర్వే నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పలువురు మహిళలు తమ బాధలు, సమస్యలు ఐద్వా నాయకులతో చెప్పుకున్నారని తెలిపారు. కరోనా తర్వాత చాలామంది ఉపాధి కోల్పోయి, ఆర్థికంగా చికితిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కూలీపని, ఆఫీసు శుభ్రం చేసే పని, ఇండ్లల్లో చేసే వంటి పనులను కరోనా కాలం లో చాలామంది కోల్పోయారని చెప్పారు. పలువురు గత్యంతరంలేక బతుకుదెరువు కోసం రోడ్లపై చారుబండి, మర్చి బండి పెట్టుకోవడం, పండ్లు, కూరగాయలు అమ్మ డం వంటి పనులు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం ఏదో ఒక స్థిరమైన ఉపాధిమార్గం చూపితే ఆ పనిచేసుకంటూ తమ కుటుంబాలను పోషించుకుంటామని అనేకమంది మహిళ లు కోరుకుంటున్నారని చెప్పారు. చాలామంది మహిళలు ఉపాధి లేక, ఆదాయంలేక పిల్లల్ని బడికి పంపలేకపో తున్నారని అలాంటి కుటుంబాల్లో పిల్లల భవిష్యత్ అంధకారంగా మారుతోందని తెలిపారు. ఉపాధిలేని పరిస్థితుల్లో కొన్నిచోట్ల పిల్లలు దురలవాట్లకు బానిసలు అవుతున్నారని చెప్పారు. ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడంతో మహిళలు ఆర్థిక ఇబ్బం దులు ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. నిత్యావసర సరుకుల ధరలను ప్రభుత్వం కంట్రోల్ చేయాలని డిమాండ్ చేశారు. పట్టణాలలో ఉపాధిహామీ పథకాన్ని అమలు చేయాలని ఐద్వా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.