Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన సీపీ అంజనీకుమార్
నవతెలంగాణ-సిటీబ్యూరో
కష్టపడకుండా ఏమీ సాధించలేం.. ఉద్యోగం పొందడాని కైనా, ఆ తర్వాత రాణించడానికైనా సిటీ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం మలక్‌పేట్‌లోని సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. 27 ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రతినిధు లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడారు. కష్టపడకుండా ఏదీ రాదని, కష్టపడిన వారికే మంచి అవకాశాలు లభిస్తాయని సీపీ అన్నారు. 'మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది' అని నిరుద్యోగులకు, యువతకు సీపీ సూచించారు. చెడు వ్యసనాలకు బానిసలై జీవితాన్ని పాడుచేసుకోవద్దని సూచించారు. సిటీలో మంచి సాంప్రదాయం ఉందన్నారు. ఎదుటివారిని ప్రేమిస్తారని అభిప్రాయడ్డారు. 27 కంపెనీల్లో దాదాపు రూ.4వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాబ్ మేళాలో 1480 మంది నిరుద్యోగులు పాల్గొన్నారని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ ఎం.రమేష్‌రెడ్డి, టీఎంఐ చైర్మెన్ టి.మురళీధరన్, ప్రిన్సిపల్ యూఏ సుందరి, అడిషనల్ డీసీపీ కె.మురళీధర్, మలక్‌పేట్ ఏసీపీ ఎన్.వెంకటరమణా, సుల్తాన్‌బజార్ ఏసీపీ పి.దేవేందర్ పాల్గొన్నారు.