Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ తహసీల్దార్ సాయిరాజు
నవతెలంగాణ-అంబర్పేట
మూసీ పరీవాహక ప్రాంతం నుంచి అక్ర మంగా మట్టి తరలి స్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని అంబర్పేట డిప్యూటీ తహసీల్దార్ సాయిరాజు, రెవెన్యూ రెమెన్యూ ఇన్స్పెక్టర్ మహేష్ రాజ్ లు హెచ్చరించారు. ఈ మేరకు శనివారం అంబర్పేట తహసీల్దార్ పి.వేణు గోపాల్ ఆదేశాల దుర్గానగర్ జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ ఎదురుగా ఉన్న మూసీ కాలువకు ఆనుకొని ఉన్న గడ్డి భూముల్లో పెద్ద ఎత్తున చెత్తా వేస్ట్ మెటీరియల్ (దబ్రుసి) వేసి మూసీ కాలువకు ఆటకం కలిగిస్తున్నారన్న సమాచారంతో మండల కార్యాలయ సిబ్బందితో కలిసి ఇక్కడ పరిశీలించారు. ఈ సందర్భంగా రెండు ట్రాక్టర్లను, 3 టిప్పర్లను సీజ్ చేసి అంబర్పేట పోలీసులకు అప్పజెప్పారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది అశ్విన్, శ్రీకాంత్, బద్రి, రాము తదితరులు పాల్గొన్నారు.