Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
- కమిషనర్ కష్ణ మోహన్ రెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అల్మాస్గూడ నుండి గుర్రంగూడకు వెళ్లే రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కష్ణ మోహన్‌రెడ్డి, డీఈ అశోక్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మెన్ చిగురింత నర్సింహ్మరెడ్డి, కార్పొరేటర్ ఏనుగు రాంరెడ్డి, టీఆర్ఎస్ కార్పొరేషన్ అధ్యక్షులు రామిడి రాంరెడ్డిలు కలిసి రూ.1కోటి 50లక్షలతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను వారు పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ కష్ణ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్లో కోట్లాది రూపాయలతో చేపట్టిన వివిధ అభివద్ధి పనులను కాంట్రాక్టర్లు ప్రభుత్వం నిబంధనల ప్రకారం చేపట్టాలన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లం ఘించిన వారిపై చర్యలు తప్పవని అయన హెచ్చరించారు. నాణ్యత ప్రమాణాలు పాటించి రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని తెలిపారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అదేశంతో కార్పొరేషన్లో ఇప్పటికే కోట్లాది రూపాయలతో అనేక అభివద్ధి కార్యక్రమాలు జరుగుతు న్నాయని పేర్కొన్నారు.ప్రజలకు ఇబ్బందులు లేకుండా రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని సూచించారు. గతంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్డు పూర్తిగా గుంతలమయంగా ఏర్పడి ఈ రోడ్డుపై ప్రయాణం చేసే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణ పనులను పూర్తయితే ప్రజల ఇబ్బందులు తీరుతాయని తెలిపారు. వారి వెంట ఏ.ఈ. బిక్కు నాయక్, కాలనీవాసులు పాల్గొన్నారు.