Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట
టపాసుల దుకాణాలు త ప్పనిసరిగా అనుమతులు తీసు కోవాలని లేకపోతే దుకాణాలను సీజ్ చేస్తామని బేగంపేట ఇన్ స్పెక్టర్ పి.శ్రీనివాసరావు అన్నా రు. ఆన్ లైన్ ద్వారా అనుమ తులు తప్పనిసరి అని తెలి పారు. హైదరాబాద్ నగరంలో ల్యాండ్, జీహెచ్ ఎంసీ పాత లైసెన్స్ ఉన్న వాళ్లకు మాత్రమే ఆన్లై న్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రెసిడెన్షి యల్ వద్ద టపాసుల దుకాణాలు పెట్టినా అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల వారి అనుమతులు తీసుకో వాలనీ, ఎన్వోసీ తీసుకుని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పాత లైసెన్స్‌ను జోడించి అనుమతి తీసుకోవాలని కోరారు. టపా సులు కాల్చే ముందు ఒక్కరూ జాగ్రత్తలు తీసుకో వాలని సూచించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన డీసీపీ ఆఫీస్‌కు వెళ్తాయనీ, అక్కడి నుంచి మీరు పొందవచ్చని తెలిపారు. కొత్తవారికి అనుమతి లేదనీ, పాత వారికి మాత్రమే అని తెలిపారు.