Authorization
Sun April 06, 2025 10:43:20 am
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలోని మొండా డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కంటో న్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న శనివారం సికింద్రాబాద్ జీహె చ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా 150 డివిజన్లో పలు సమస్యలు జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు. బస్తీ దవాఖానలో సౌకర్యాలు, తదితర అంశాలపై చర్చిం చారు. డివిజన్లో పెరిగిపోతున్న సమస్యలను సత్వరంగా పరిష్కరించాలని జోనల్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. బస్తీ దవాఖానల్లో సౌకర్యాలు కల్పించాలని కోరారు.
పాఠశాల తనిఖీ..
అంతకుముందు 150 మొండా డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే సాయన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఉపాధ్యాయుల ద్వారా అడిగి తెలుసుకున్నా రు. పరిష్కారానికి త్వరలో నిధులు కేటాయిస్తానని తెలిపారు. అలాగే బస్తీ దవాఖానను కూడా పరిశీ లించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ చైర్మన్ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ లాస్య నందిత, ఏడో వార్డు మహిళా అధ్యక్షురాలు నాగిని సరిత, మాజీ కో-ఆప్షన్ సభ్యులు నరసింహ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.