Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియ యూనివర్సిటీ జేఏసీ, తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి పేర్ని నాని చిత్రపటానికి చెప్పుల దండతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నాయకులు అశోక్ యాదవ్, హరీష్గౌడ్, రవీందర్ నాయక్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అమరులైన 1200 మంది అమరుల త్యాగాలను కించ పరుస్తూ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను కలపండి అనీ, రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ తీర్మానాలు చేయండి అని చెప్ప డాన్ని ఓయూ జేఏసీ తీవ్రంగా ఖండించింది. ఇది 1200 మంది అమరుల త్యాగాలను కించపర్చడమే అనీ, 16 నెలల జైలు జీవితం అనుభవించి రూ.లక్షల కోట్లు దోపిడీ కేసులో నింధితులైన దోపిడీదారులకు అమరుల త్యాగాల విలువ తెలియదనీ, నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం నినాదం మీద ఏర్పడ్డ తెలంగాణలో మళ్లీ రాష్ట్రాలను కలుపుతాం అని మాట్లాడటం అమరుల త్యాగాలను కించపరిచేనట్టే అన్నారు. అందులో భాగంగానే మీ చెల్లి షర్మిలను తెలంగాణ ప్రాంతంలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయించి ప్రజల్లో తిప్పుతున్నట్టుగా విద్యార్థి జేఏసీ భావిస్తుందనీ, ఇప్పటి వరకు ఎంతో ఓపిక, సహనంతో తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆంధ్రా వ్యాపారస్తులు, పెట్టుబడిదారులకు ఎలాంటి అవమానాలకు గురి చేయ కుండా చూసుకుంటున్న తెలంగాణ ప్రజల సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. మీరు ఇలాగే మాట్లాడితే తప్పనిసరిగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆంధ్రా పెట్టు బడిదారులు, వ్యాపారస్తులు, దోపిడీదారులు అందరిపైనా దాడులు తప్పవని హెచ్చరించారు. ఆంధ్రా మంత్రి పేర్ని వెంకట్రామయ్య తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలనీ, సీఎం జగన్ మంత్రి వెంకట్రామయ్యను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ చైర్మెన్ మాందాల భాస్కర్, అధ్యక్షులు దత్తాద్రి, నాగరాజు, అనిల్, వినరు, షణ్ముఖచారి, తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.