Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేందుకు కషిచేసిన నాంపల్లి బాబా 17వ ఆరాధన ఉత్సవాలను ఈ నెల 4 నుంచి 6 వరకు నిర్వహిస్తున్నట్లు సంస్థాన్ అధ్యక్షుడు అజరు బాబు తెలిపారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను సంస్థాన్ ప్రతినిధులు విజరు భాస్కర్, సాయి శ్రీనివాస్, సురేష్ లతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ మియాపూర్ దీప్తి నగర్ లోని మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. 4న గురుచరిత్ర పారాయణం, 5న అఖండ నామాలు, 6న దత్త హోమం, పల్లకి సేవ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమాలకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు హాజరవుతారని తెలిపారు