Authorization
Sun April 06, 2025 06:46:25 pm
నవతెలంగాణ-ఓయూ
లాలాపేట్ ప్రొ. జయ శంకర్ స్టేడియంలో ఉన్న ఓపెన్ జిమ్‌కు వెంటనే మరమ్మతుల చేయాలని కోరుతూ స్టానికుడు ఎం. ఈశ్వర్ రావు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీ మోహన్ రెడ్డి లకు వినతిపత్రం అందజేశారు. వద్ధులు, చిన్నారులకు, విద్యార్థులకు, యూత్ ఓపెన్ జిమ్ ద్వారా ఉదయం, సాయంత్రం వేళల్లో ఇక్కడ వ్యాయామం ఎంతో సౌకర్యం ఉంటుందని అన్నారు. అయితే గత కొన్నాళ్లుగా కొన్ని పరికరాలు పనిచేయడం లేదని, ఇంకొన్ని పరికరాలు మరమ్మతులు చేపట్టాల్సి ఉందని చెప్పారు. అధికారులు స్పందించి ఓపెన్ జిమ్‌కు మరమ్మతులు చేయాలని కోరారు.