Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్నగర్
జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24వ డివిజన్ వెంకటేశ్వరస్వామి గుడి కమాన్ మట్టి రోడ్డును సీసీ రోడ్డుగా నిర్మించడానికి రూ.14 లక్షల డిస్ట్రిక్ మైనింగ్ నిధులతో చేపట్టిన పనులకు మేయర్ మేకల కావ్య సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో 24 డివిజన్ కార్పొరేటర్ గొడుగు వేణు, డిప్యూటీ మేయర్ ఆర్ఎస్ శ్రీనివాస్, కార్పొరేటర్లు, వార్డు కమిటీ సభ్యులు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.