Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేటలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను డిసెంబర్ మొదటి వారంలో లబ్దిదారులకు అందజేయ నున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. సోమవారం బన్సీలాల్‌పేటలోని బండ మైసమ్మనగర్, సీసీ నగర్లో ఇండ్లను పరిశీలించి పనుల గురించి అధికా రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు. అందులో భాగంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇండ్లను నిర్మించి ఇస్తుందని చెప్పారు. బండ మైసమ్మ నగర్లో 310 గృహాల ప్రవేశం డిసెంబర్ 5వ తేదీన, సీసీ నగర్లో 240 ఇండ్ల ప్రవేశం డిసెంబర్ 8న పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఇండ్ల నిర్మాణ పనులు పూర్తయ్యా యనీ, రోడ్లు, డ్రయినేజీ తదితర పనులు కొనసాగుతు న్నాయని తెలిపారు. బస్తీ వాసుల అందరి సమక్షంలో అర్హులైన లబ్దిదారులను గుర్తించి లాటరీ పద్దతిలో ఇండ్లను కేటాయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత లక్ష్మీపతి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ వసంత, హౌసింగ్ ఈఈ వెంకట దాసురెడ్డి, వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, ఎలెక్ట్రికల్ డీఈ శ్రీధర్ పాల్గన్నారు.