Authorization
Thu April 10, 2025 10:33:10 am
నవతెలంగాణ-గాంధీనగర్
పట్టుదల, కషి ఆత్మవిశ్వాసమే విజయానికి చిరునామా అని శ్యామ్ ఎస్ఐ పోలీస్ ఇన్స్టిట్యూట్ చైర్మెన్ జి. శ్యామ్ అభివర్ణించారు. మంగళవారం ఎస్ఐ పోలీస్ విద్యార్థులకు ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలనే దానిపై గైడెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లక్షల్లో వ్రాస్తూ ఉంటే వందల్లో ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయన్నారు. విజేతగా మారాలంటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, దాని సాధన కోసం ఒక ప్రణాళిక ప్రకారం అలుపెరగని కషి ఆత్మవిశ్వాసంతో చేయాలన్నారు. అన్నీ సబ్జెక్ట్స్ ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేసి విద్యార్థుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దడం సంస్థ ప్రధాన లక్ష్యం అన్నారు. విద్యార్థులు నిరాశ నిస్పహలకు అవకాశం ఇవ్వకుండా ఆత్మవిశ్వాసంతో ప్రిపరేషన్ సాగించి విజయాన్ని అంది పుచ్చుకోవాలి కోరారు. విద్యార్థులకు వచ్చే సందేహాలు తీర్చడానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ బందం ముందుంటుందని అన్నారు. కార్యక్రమంలో హైదరబాద్ బ్రాంచ్ ఇన్óచార్జి ప్రదీప్, రీజనింగ్ విభాగం ఫ్యాకల్టీ సంతోష్ రెడ్డి, ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కేవీఆర్ తదితరులు పాల్గొన్నారు.