Authorization
Mon April 07, 2025 12:21:58 am
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మహిళలు, చిన్నారుల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే షీటీంకు సమాచారం ఇవ్వాలని షీటీఎం సబ్ ఇన్స్పెక్టర్ మల్లేష్ యాదవ్ అన్నారు. నాగారం మున్సి పాలిటీ పరిధిలోని సెరినిటీ పాఠశాలలో రాచకొండ కమిష నరేట్ కుషాయగూడ షీ-టీం ఆధ్వర్యంలో అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా షీ-టీం ప్రియాంక మాట్లాడుతూ ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు టీజింగ్, అసభ్యంగా ప్రవర్తించినప్పుడు భయపడకుండా పెద్దలకు, షీ-టీంకు సమాచారం అందించాలని కోరారు. సమస్యలు వచ్చినప్పుడు ధైర్య సాహసాలతో ఎదుర్కోవాల న్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ నోముల జంగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి నోముల వసంత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.