Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చర్లపల్లి డివిజన్ పరిధిలోని గాంధీనగర్ కాలనీలో స్థానిక నాయకులతో కలిసి ఆయా సమస్యల గురించి అడిగి తెలుసు కున్న కార్పోరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్. ఈ సందర్భంగా కాలనీ లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని కాలనీవాసులు కోరడంతో త్వరలోనే పరిష్కరిస్తానని తెలియజేశారు. అనంతరం ఆదర్శ్‌నగర్ కాలనీలో జరుగుతున్న బాక్స్ డ్రైన్ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలనీ, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు బాల్‌రెడ్డి, సాయినాథ్, రామచందర్, వెంకటచారి, రవిచంద్ర, ప్రభుగౌడ్, విద్యాసాగర్, కనకరాజుగౌడ్, శ్రీకాంత్ యాదవ్, రాజేశ్వర్‌రెడ్డి, జయకృష్ణ, కనకయ్య, తాండ్ర యాదగిరి, బాబు గంగపుత్ర, రాఘవరెడ్డి, శేఖర్, సురేష్, మల్లేష్, సాయి వంశీ, ఆదర్శనగర్ కాలనీ వాసులు, యాదగిరి, మల్లేష్, విజరు, బుల్లెట్ శ్రీను, మస్తగిరి శ్రీరాములు, నర్సింహా వంశరాజు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-కాప్రా