Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
భారతదేశంలో పండుగ సంబురాలు అంబరాన్ని తాకుతున్నాయి. సోనాలికా ట్రాక్టర్స్ ఇప్పుడు రైతుల వ్యవసాయ సంబంధిత అవసరాలను తీర్చడానికి పూర్తి సన్నద్ధమైంది. భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందడంతో పాటుగా దేశం నుంచి నెంబర్ 1 ఎగుమతి బ్రాండ్‌గా నిలిచిన సోనాలికా ట్రాక్టర్స్ ఈ పండుగ సీజన్లో కస్టమైజ్డ్ ట్రాక్టర్ పోర్ట్‌ఫోలియోతో అద్భుత విజయాలను నమోదు చేస్తుంది. సోనాలికా ఇప్పడు తమ అత్యధిక వైటీడీ సంఖ్యను 2022 ఆర్ధిక సంవత్సరంలో నమోదు చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే 79,829 యూనిట్లు అయితే ఈ సంవత్సరం 85,068 యూనిట్లను విక్రయించింది. వ్యవసాయ యాంత్రికీకరణ దిశగా రైతులు ఆసక్తి కనబరుస్తుండటంతో అక్టోబర్‌లో 17,130 ట్రాక్టర్లు విక్రయించి రికార్డు నమోదు చేసింది. ఈ ప్రదర్శన గురించి సోనాలికా ట్రాక్టర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమణ్ మిట్టల్ మాట్లాడుతూ 'సోనాలికా హెవీడ్యూటీ ట్రాక్టర్ల జాబితా పట్ల రైతులకు అపారనమ్మకం ఉంది. అది ఇప్పుడు మరోమారు నిరూపితం కావడంతో పాటుగా మా అద్భుతమైన ప్రయాణంలో మరో మైలురాయి అధిగమించడంలో తోడ్పడింది' అని సందర్భంగా వారు తెలిపారు.