Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
డబుల్ బెడ్ రూం ఇండ్ల పేరుతో వసూళ్లకు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని గృహ నిర్మాణ శాఖ, పోలీసు అధికారులను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ పేరుతో జరిగిన వసూళ్లపై గృహ నిర్మాణ శాఖ, పోలీసు శాఖల అధికారులు సమగ్ర విచారణ జరిపి దోషులను దండించి బాధితులకు అండగా నిలవాలని సంబంధిత శాఖల అధికారులతో పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ పథకాల పేరుతో ప్రజల నుంచి వసూళ్లకు పాల్పడితే సహించేది లేదన్నారు. ప్రభుత్వ పథకాలు పక్కదారి పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులతో పాటు పార్టీ నేతలతో పాటు ప్రజలకు ఉందన్నారు. డబుల్ బెడ్ రూమ్ పేరుతో అక్రమాలకు పాల్పడితే, పార్టీ నేతలైనా, దళారులైనా ఉపేక్షించబోమనీ, క్రిమినల్ కేసులతోపాటు కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్, టీఆర్ఎస్ చర్లపల్లి డివిజన్ కార్యదర్శులు అనిల్ ముదిరాజ్, చర్లపల్లి కాలనీల సమాఖ్య ప్రతినిధి ఎంపల్లి పద్మారెడ్డి, నాయకులు నేమూరి మహేష్‌గౌడ్, జౌండ్ల ప్రభాకర్‌రెడ్డి, కడియాల బాబు, కె వి ఎల్ ఎన్ రావు, వంశీ, రేగుల సతీష్‌రెడ్డి, రామకృష్ణ నగర్ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు రాంప్రసాద్, రమేష్ దేవరాజ్, నవీన్, సోమిరెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు.