Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కేజీఆర్ కాలేజీలో బీ ఫార్మసీ కోర్సు నిర్వహించుటకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని కాలేజీ చైర్మెన్ గోవింద్‌రెడ్డి తెలిపారు. బుధవారం నాగారం మున్సిపాలిటీ, రాంపల్లి గ్రామంలోని కేజీఆర్ కళాశాలలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళాశాల 2008లో ప్రారంభమై ఎంబీఏ కోర్సులో 60 మంది విద్యార్థులతో నడిచి ప్రస్తుతం 240 మంది విద్యార్థులతో సాగుతోందన్నారు. 2010లో ఎం ఫార్మసీ కోర్సు ప్రారంభమై మూడు స్పెషలైజేషన్లు ఫార్మా కాలేజీ, అనాలిసిస్, స్యూ టిక్స్‌తో 600 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. ఉస్మానియా యూనివర్సి టీలో కేజీఆర్ కళాశాల మొదటి స్థానంలో ఉందని కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ పీవీ రమణారావు తెలిపారు. కళాశాల చైర్మెన్ గోవింద్‌రెడ్డి పారిశ్రామిక వాడలో నాలుగు ఉత్పత్తి సంస్థలు కలిగి ఉండటంతో వారికి గల పారిశ్రామిక సంబంధాలతో వివిధ కంపెనీలు విద్యార్థులకు ఉపాధి కల్పించే అవకాశం ఉందన్నారు. కళాశాలలో మంచి నైపుణ్యంచ, అనుభవం గల ప్రొఫెసర్లు వ్యక్తిత్వ వికాస నైపుణ్యం విద్యార్థులకు అందిస్తున్నామని తెలిపారు.