Authorization
Sun April 06, 2025 06:33:55 pm
నవతెలంగాణ-ఓయూ
రాబోయే కాలంలో ఇండో పసిఫిక్ అధ్యయనాలకు మరింత ప్రాధాన్యత పెరగనున్నదని కల్నల్ డాక్టర్ మోహిత్ పేర్కొన్నారు. ఓయూ సీఐపీ లెక్చర్ సిరీస్‌లో భాగంగా బుధవారం డైరెక్టర్ డాక్టర్ కొండ నాగేశ్వర్ అధ్యక్షతన 'ఇండో పసిఫిక్ రీజియన్ అండ్ జియో స్ట్రాటజీస్' అనే అంశంపై కల్నల్ డాక్టర్ మోహిత్ ప్రసంగించారు. భవిష్యత్‌లో భారతదేశం.. చైనా, ఇతర దేశాలతో అనేక రకాల సంబంధాలను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గడిచిన రెండు దశాబ్దాలుగా ఇండో పసిఫిక్ రీజియన్ భద్రత, ఆర్థిక కోణాల్లో ప్రాధాన్యత ఉందని, ఈఅంశాలపై విశ్వవిద్యాలయాలు పరిశోధనలు కొనసాగించాలని సూచించారు. డాక్టర్ కొండా నాగేశ్వర్ మాట్లాడుతూ ఓయూలో ఇండో పసిఫిక్ సెంటర్‌ను నెలకొల్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇటీవలే వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ నాయకత్వంలో వర్క్‌షాప్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సమావేశంలో టెక్నికల్ కోఆర్డినేటర్ శామ్యూల్, వివిధ విభాగాల ఆచార్యులు, పరిశోధకులు పాల్గొన్నారు.