Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) నగర కార్యదర్శి వర్గ సభ్యులు అబ్దుల్ సత్తార్
- చార్మినార్ బస్టాండ్ వద్ద కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-సిటీబ్యూరో/ధూల్‌పేట్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రోజురోజుకూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నదని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సౌత్ సిటీ కార్యదర్శివర్గ సభ్యులు అబ్దుల్ సత్తార్ విమర్శించారు. చార్మినార్ బస్టాండ్ వద్ద సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సౌత్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్‌సత్తార్ మాట్లాడుతూ.. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో సామాన్యులు ఏమీ కొనలేని, తినలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను పోషించలేక, ఇంటికిరాయిలు కట్టలేక దుర్భర జీవితాలు గడుపుతున్నారని, జీవించడమే భారంగా మారిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదలను దోచి పెద్దలకు పెడుతున్నదని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పెట్రోల్, డీజిల్, గ్యాస్‌కు సంబంధించిన పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆటోగ్యాస్ కూడా పెరిగినందువల్ల ఆటోలు నడవలేని పరిస్థితి, వాళ్ల కుటుంబాలను పోషించలేని దుస్థితి దాపురించిందన్నారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు బాబర్‌ఖాన్, షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.