Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయం అర్బన్ సెంటర్ నూతన డైరెక్టర్‌గా ఓయూ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన సీనియర్ ప్రొఫెసర్ ఎం కుమార్ శుక్రవారం తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అయన గతంలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా, ఓయూ కంట్రోలర్‌గా సేవలు అందించారు. పరీక్షల కంట్రోలర్‌గా ఉన్న సమయంలో అక్కడ పూర్తిస్థాయిలో ఆన్లైన్ సేవలు, ఆన్లైన్ మూల్యాంకనం ప్రవేశ పెట్టారు. 2018లో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉత్తమ టీచర్ అవార్డ్, బెస్ట్ ఇంజినీర్ అవార్డ్స్ స్వీకరించారు. ప్రస్తుతానికి ఓయూ ఈసీ సభ్యులు గా కొనసాగుతున్నారు. బాధ్యతలు చేపట్టాక అక్కడ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి వివిధ అంశాలపై చర్చించారు. అందరూ సమిష్టిగా సెంటర్ ఉన్నతికి కషి చేయాలని, అందరు కలిసి ముందుకు పోవాలని కోరారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డా.వరాల.గంగయ్య, ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ రామారావు, రిసర్చ్ ఆఫీసర్ డా.కె.శ్రీనివాస్, ఉద్యోగులు పాల్గొన్నారు.