Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
ఈనెల 7న నిర్వహించనున్న దసరా, దీపావళి ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని మేరు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.బి సాంగ్వార్ అన్నారు. శుక్రవారం మేరు సంఘం కార్యదర్శి మాడిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ను కలిసి సమ్మేళనానికి రావాలని ఆహ్వానించారు. దసరా, దీపావళి ఆత్మీయ సమ్మేళనంలో మేరు వివాహ పరిచయ వేదిక ఉంటుందన్నారు. గతంలో ఈ పరిచయ వేదిక ద్వారా 116 జంటలను ఏకం చేసిన ఘనత దక్కించుకున్నామన్నారు. నవంబర్ 7న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే ఆత్మీయ సమ్మేళనం సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మేరు సంఘం నాయకులు రాచర్ల మౌనిక ప్రభు, కీర్తి రమేష్, కాటారం శ్రీనివాస్ పాల్గొన్నారు.