Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
రాష్ట్ర సంగీత నాటక అకాడమీ సౌజన్యంతో శతిలయ కళా నాట్య మండలి, మిడ్జిల్ వారు రవీంద్రభారతి వేదికపై 'మోహిని భస్మాసుర' నాటకాన్ని రసవత్తరంగా ప్రదర్శించారు. భస్మాసురునిగా దామోదర్ అభినయం ఆకట్టుకోగా, మోహినిగా సురభి కళాకారిణి జ్యోతి నటన, వచికం ప్రశంసనీయంగా ఉంది. శివునిగా నరసింహులు, విష్ణువుగా లక్ష్మి నారాయణ, నారదునిగా ఎస్. కష్ణ, లక్ష్మీ గా సురభి వెంగమాంబ పాత్రోచితంగా నటించారు. సంగీతం హద్యంగా ఉంది. ఈసందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు గోరేటి వెంకన్న, శాసన సభ సభ్యుడు సి.లక్ష్మారెడ్డి, సంగీత నాటక అకాడమీ పూర్వ చైర్మెన్ బాద్మి శివకుమార్ పాల్గొని పౌరాణిక నాటకాల్లో ప్రతిభావంతులని నిరూపిస్తున్నారని అన్నారు. సంగీత నాటక అకాడమీ కార్యదర్శి వసుంధర మాట్లాడుతూ శనివారం చింతామణి నాటకం నాగర్ కర్నూల్ వారితో ప్రదర్శితమవుతోందని, శాసన మండలి సభ్యుడు గోరేటి వెంకన్న ఈ నాటకంలో నటిస్తున్నారని తెలిపారు. కార్యదర్శి నారాయణ చారి వందన సమర్పణ చేశారు.