Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
రజక కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి అన్నారు. శుక్రవారం తార్నాక ఎర్రకుంట చెరువు దోబీఘాట్లో రజక సేవా సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఈదమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రజక కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని, అక్కడ స్ట్రీట్ లైట్లు, దోబీఘాట్ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా ఆలయ నిర్వాహకులు పలువురికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో వార్డు మెంబర్ వంజరి వెంకటేష్, టీఆర్ఎస్ నాయకులు అనిల్ సర్వదే, తార్నాక రజక సేవా సంఘం అధ్యక్షులు కృష్ణ, ప్రధాన కార్యదర్శి రమేష్, ఉపాధ్యక్షులు వి. మైసయ్య, ఎ.హనుమంతు, కోశాధికారి పి. రాజు, నిర్వహణ కార్యదర్శి జె. శ్రీనివాస్, మల్లికార్జున్, సోమయ్య, సాలయ్య, తిరుపతి భూమయ్య, వెంకటయ్య పాల్గొన్నారు.