Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ రూరల్
సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి కింద గౌడవెల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ రెడ్డికి లక్ష రూపాయలు మంజూరైంది. ఇందుకు సంబంధించిన చెక్కును మంత్రి మల్లారెడ్డి శుక్రవారం బోయిన్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారుడికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం సహాయనిధి కారణంగా నిరుపేదలు ఖరీదైన వైద్యం పొంది, ప్రాణాలు రక్షించుకుంటున్నారని తెలిపారు. ఆపదలో ఉన్న పేదలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మ జగన్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్, రవీందర్ గౌడ్, పీఏసీఎస్ చైర్మెన్ రణదీప్ రెడ్డి, సంజీవ గౌడ్, సంతోష్, రాకేష్ పాల్గొన్నారు.