Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
పేకాట శిబిరంపై దాడి చేసి నిందితులను అరెస్టు చేసిన సంఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఎస్ఐ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బోయినపల్లికి చెందిన కార్తీక్ ఓల్డ్ బోయినపల్లిలోని రోడ్ నెంబర్ 5లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఏకంగా దానిని పేకాట స్థావరంగా మార్చాడు. ఒక్కో వ్యక్తివద్ద రూ. వెయ్యి వసూలు చేస్తూ పలువురితో కలిసి రోజూ పేకాట శిబిరాన్ని కొనసాగిస్తున్నాడు. గురువారం ఉదయం నుంచి కొందరు వ్యక్తులు ఇక్కడ పేకాల ఆడుతున్నారు. పోలీసు ఇన్ఫార్మర్ అయిన వ్యక్తి ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేశాడు. లొకేషన్ కూడా పంపించాడు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పేకాట శిబిరంపై దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఐదుగురు నిందితులైన శ్రీనివాస్, రాకేష్, సహదేవ్, నవీన్, ఎస్కె. అఫ్రోజ్ అరెస్ట్ చేశారు. తీసుకుని వారి వద్ద నుంచి రూ. 5200, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేశారు. శుక్రవారం పేకాట రాయుళ్లను రిమాండ్కు తరలించారు. కాగా ప్రధాన నిర్వాహకుడు కార్తీక్ పరారీలో ఉన్నాడు. అతనికోసం గాలిస్తున్నట్లుపోలీసులు తెలిపారు.