Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
నేరెడ్మెట్ డివిజన్ పరిధి డిఫెన్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బీన్ లీఫ్ బిస్టో కాఫీ షాప్‌ను స్థానిక డివిజన్ కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజలకి నాణ్యమైన ఆహారం అందించి మంచి పేరు తెచ్చుకోవాలని షాప్ యజమానులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ ఉపేందర్‌రెడ్డి, చెన్నారెడ్డి, రఘుపతిరెడ్డి, శివ, గోపి, మహేష్, ఉత్తమ్, సుజిత్, కరుణాకర్, లోహిత్, తదితరులు పాల్గొన్నారు.