Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
అల్వాల్ సర్కిల్ అల్వాల్ డివిజన్లోని తిరుమల ఎన్క్లేవ్ కాలనీలో ఆదివారం అల్వాల్ సీఐ గంగాధర్ స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డితో కలిసి కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ గంగాధర్ మాట్లాడుతూ సీసీ కెమెరాలు నేర నియంత్రణ కాకుండా పిల్లల భవిష్యత్‌ను కనిపెట్ట డానికి కూడా పని చేస్తాయన్నారు. సీసీ కెమెరాల వల్ల కాలనీలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు, దొంగలు కానీ వచ్చినా గుర్తు పట్టడానికి వీలుంటుందని తెలిపారు. తమ పిల్లలు ఇంట్లో, కాలనీలో ఎవరితో మాట్లాడుతున్నారు.. ఏ సమయంలో ఏం చేస్తున్నారని చూసుకోవడానికి సీసీ కెమె రాలు దోహదం చేస్తాయన్నారు. కాలనీవాసులకు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు. పిల్లల భవిష్య త్‌పై సీసీ కెమెరాల ప్రాధాన్యతను కూడా వివరించారు. కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకు వస్తే వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సర్కిల్ మహిళా అధ్యక్షురాలు జార్జి తిరుమల, ఎంక్లొవ్ కాలనీ కమిటీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ రెడ్డి, ఉపా ధ్యక్షుడు ఏవీ రావు, ట్రెజరర్ వంశీకృష్ణ, జాయింట్ సెక్రెట రీ శివ ప్రసాద్, కాలనీ వాసులు వాసుదేవ రెడ్డి, రాజా, రెడ్డి రాజు, శ్రీలక్ష్మి, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.