Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం అధ్యక్షులుగా వెన్నా ఈశ్వరప్పను ఎన్నుకు న్నారు. ఆదివారం సికింద్రాబాద్ ఎన్టీరోడ్లోని తాజ్మ హల్ హౌటల్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా పట్టోళ్ల సంగమేశ్వర్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్న కార్యవర్గానికి, వీర శైవలింగాయత్ సామాజిక వర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో వీరశైవ లింగాయత్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు చొరవ చూపిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ సభ్యులు డాక్టర్ సోమశేఖర్, డాక్టర్ శివప్ప, కె.బసవ్ప, వీరభద్రప్ప, మాజీ ప్రధాన కార్యదర్శి దినేష్ పాటిల్, నాయకులు శివచరణ్, జీహచ్ఎంసీ అధ్యక్షులు రాజప్ప, తదితరులు పాల్గొన్నారు.