Authorization
Thu April 10, 2025 03:40:31 pm
నవతెలంగాణ-మేడ్చల్ రూరల్
రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం పెద్దపీట వేసిందని రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. కేంద్రం ధాన్యం కొనడానికి ముందుకు రాకున్నా రైతును ఆదుకోవాలన్న ఉద్దేశంతో పండించిన ప్రతి గింజనూ రాష్ట్రం కొనుగోలు చేస్తుందన్నారు. మేడ్చల్ మండలంలో మంత్రి ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని మునీరాబాద్, పూడూరు, రాజబొల్లారం, రావల్కోల్, డబిల్పూర్, రాయిలాపూర్, మేడ్చల్‌లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.2 కోట్లతో పూడూరు అనుబంధ గ్రామమైన గోసాయిగూడలో ఫంక్షన్ హాల్ నిర్మాణాన్ని ప్రారం భించారు. మేడ్చల్, డబిల్పూర్, పూడూరు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా పరిషత్ చైర్మెన్ శరత్ చంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమాy ేశాల్లో మంత్రి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో అధికారంలోనికి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పని చేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీళ్లు, 24 గంటల ఉచిత విద్యుత్, పెట్టుబడులకు రైతుబంధు, రైతు కుటుం బానికి ఆదుకోవడానికి రైతు బీమా ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సకాలంలో ఎరువులు, విత్తనాలను కూడా సిద్ధం చేస్తుందని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం సాకారం కావడం వల్లే ఇది సాధ్యపడిందన్నారు. రైతును రాజు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలుకు ముందుకు రాకున్నా కష్టకాలంలో సైతం ప్రభుత్వం గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుందని చెప్పారు. రైతు సంక్షేమంతో అభివృద్ధికి కూడా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్నారు. రోడ్లు, డ్రయినేజీ, నీళ్లు తదితర మౌలిక సదుపాయాలకు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి దూరంగా ఉన్న గ్రామాలు ఏడేండ్ల టీఆర్ఎస్ పాలనలో సమకూర్చోగలిగాయన్నారు. సీఎం కేసీఆర్ చూపిన బాటలో గ్రామాల అభివృద్ధికి ఎమ్మెల్యే నిధులు కేటాయించినట్టు తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న 61 గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున రూ.6.10 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. పూడూరు సహకార సంఘానికి టీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి కృషితో వెజిటేబుల్ క్లస్టర్ మంజూరైందనీ, త్వరలో ప్రారంభం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పద్మాజగన్ రెడ్డి, జెడ్పీటీసీ శైలజా విజయానందరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మెన్ మధుకర్‌రెడ్డి, వైఎస్ ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మర్రి దీపికా నర్సింహరెడ్డి, వైస్ చైర్మెన్ చీర్ల రమేశ్, సర్పంచులు గీతాభా గ్యరెడ్డి, గణేశ్, బాబుయాదవ్, మహేందర్, నర్మదా గోపాల్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్లు సుధాకర్ రెడ్డి, రణదీప్ రెడ్డి, సురేశ్ రెడ్డి, ఎంపీటీసీ గోపని వెంకటేశం, నీరుడి రఘు, అనుపశ్రీకాంత్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మెన్ భాస్కర్ యాదవ్, మాజీ సర్పం చులు రాజమల్లారెడ్డి, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, జగన్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి దర్శన్, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.