Authorization
Mon April 07, 2025 04:56:09 am
నవతెలంగాణ-మేడ్చల్ రూరల్
సీఎం సహాయనిధి పేద ప్రజలకు వరమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఇందుకు సంబంధించిన చెక్కును మంత్రి ఆదివారం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా డబిల్ పూర్ గ్రామానికి విచ్చేసిన ఆయన గ్రామానికి చెందిన తలారి లక్ష్మయ్యకు రూ.25 వేల చెక్కును ఆదివారం అందజే శారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం సహాయనిధి కారణంగా నిరుపేదలు ఖరీదైన వైద్యం పొంది, ప్రాణాలు రక్షించుకుంటున్నారని తెలిపారు. సంక్షేమానికి పెద్దపీట వేసే సీఎం కేసీఆర్ నిరుపేదలకు ఉపయోగపడే సీఎం సహాయ నిధికి ఎంత కష్టమైన నిధుల మంజూరును ఆపడం లేదన్నారు. ఆపదలో ఉన్న పేదలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పద్మా జగన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రాజమల్లారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ వీర్లపల్లి రాజమల్లారెడ్డి, నాయకులు శ్రీనివాస్, రవీందర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మెన్ సురేష్‌రెడ్డి, రణదీప్ రెడ్డి, వార్డు సభ్యులు తలారి హరిబాబు, టీఆర్ఎస్ నాయకులు జీడిపల్లి ఆనంద్ బాబు, జింకల నరేష్ పాల్గొన్నారు.