Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
వికలాంగుల బంధు పథకం సాధన కోసం కాప్రా తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎన్పీఆర్డీ మండల కార్యదర్శి కె. నాగలక్ష్మి, అధ్యక్షు రాలు సాయిన్ బేగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు కురునెల్లి వెంకట్ హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలనీ, ఈ పథకంలో వికలాంగులకు 25శాతం అదనంగా చెల్లించాలనీ, ఈ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ముట్టడి చేస్తామ న్నారు. వికలాంగుల సాధికారత, సమగ్రాభివృద్ధి కోసం వికలాంగుల బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ పథకం కోసం ఈ నెల 12వ తేదీన మేడ్చల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. సమాజంలో వికలాంగులు అత్యంత వెనుకబ డిన ఉన్నారనీ, వారి సంక్షేమం కోసం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టా లన్నారు. రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఏడేండ్ల కాలంలో వికలాంగులకు ఆసరా పింఛన్లు మాత్రమే పెరిగాయనీ, మిగతా సంక్షేమ పథకాలు ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం సెక్షన్ 37 (బి) ప్రకారం అన్ని రకాల సంక్షేమ పథకాల్లో 5 శాతం వికలాంగులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 24(1) ప్రకారం సాధారణంగా ఇచ్చే లబ్దిలో 25 శాతం వికలాంగులకు అదనంగా ఇవ్వాలని ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాల్లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దళిత బంధు పథకంలో లబ్దిదారుల ఎంపికలో అర్హులైన వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాం డ్ చేశారు. సంక్షేమ పథకాల్లో వికలాంగులకు 25శాతం అదనంగా చెల్లిం చాలనీ, 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం పేర్కొందని తెలి పారు. రాష్ట్రంలో వికలాంగులపై వేధింపులు, దౌర్జన్యాలు రోజురోజుకూ పెరిగి పోతున్నాయనీ, వీటిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న ఆసరా పింఛన్లు వెంటనే మంజూరు చేయాలనీ, 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని ప్రభుత్వ శాఖలన్నీ పటిష్టంగా అమలు చేయాలనీ, డబుల్ బెడ్రూం ఇండ్లలో ఐదు శాతం వికలాంగులకు కేటాయించాలనీ, లబ్దిదారుల ఎంపికలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనీ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్మిస్తున్న మోడల్ మార్కెట్లలో షాపుల కేటాయింపుల్లో 5 శాతం వికలాంగులకు కేటాయించాలనీ, తీవ్ర వైకల్యం గల వికలాంగులు, వారి సహాయకులకు ప్రత్యేక అలవెన్సులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అమరావతి, రాజు, నాగరాజు, సాయి, బ్రహ్మయ్య, రమేష్, జాహ్నవి, కొమరమ్మ, చంద్రశేఖర్ పాల్గొన్నారు.