Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
పల్లె దవాఖానలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కౌన్సిలర్ కొత్త సురేఖ భాస్కర్‌గౌడ్ పేర్కొన్నారు. సోమవారం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలో 5వ వార్డులో వార్డు కార్యాల యంలో పల్లె దవాఖాన కార్యక్రమం ప్రారంభించారు. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఇక్కడ వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాను నాయక్, వెంకటేష్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త భాస్కర్, కొత్త రాజుగౌడ్, సురేష్ యాదవ్, డాక్టర్ సిందుజ, ఏఎన్ఎం విజయ రాణి, ఆశా వర్కర్ కవిత, సంధ్య పాల్గొన్నారు.