Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్‌పార్టీ లీగల్ సెల్ చైర్మెన్ వంగేటి ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. సోమవారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీర్జాదిగూడ కార్పొరేషన్లో టీఆర్ఎస్ సరిపడా బలం ఉన్నప్పటికీ ఇతరత్రా ప్రలోభాలకు గురిచేసి ఇతర పార్టీల నుంచి గెలుపొందిన కార్పొరేటర్లను చేర్చుకున్నారని విమర్శించారు. నేడు పీర్జాదిగూడ పాలక వర్గంలో ప్రజా సమస్యలపై చర్చలు జరగడం లేదన్నారు. ఎంతసేపు వసూళ్లు, పంపకాల గురించి ఆలోచిస్తున్నారని, అందులో తేడాల కారణంగా సొంతపార్టీ నేతలే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని, ప్రజా సమస్యలు గాలికి వదిలేశారని విమర్శించారు. పాలక వర్గం మేయర్‌పై అనేక కారణాలు చూపుతూ విమర్శలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. కార్పొరేటర్లకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే తమ పదవులకు రాజీనామా చేసి మరోసారి ప్రజా క్షేత్రంలోకి రావాలని సవాలు విసిరారు.