Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్నగర్
మహిళా చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి అన్నారు. సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆఫీసులో అంగన్వాడీ, ఆశా వర్కర్లు, పారా లీగల్ వాలంటీర్లకు మహిళ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాల గురించి తెలుసుకొని ఉండాలన్నారు. పరస్పర అంగీకారంతో ఫ్యామిలీ, భూ తగాదాలు, తదితర కేసులను న్యాయసేవాధికార సంస్థ ద్వారా పరష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో హేమలత అనితా రాణి, శ్యామల దేవి, రజిని దేవి పాల్గొన్నారు.