Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
బాగ్‌లింగంపల్లిలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ జలమండలి కార్యాలయం వద్ద సీపీఐ(ఎం) రాంనగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా సీపీఐ(ఎం) ముషీరాబాద్ జోన్ కార్యదర్శి వర్గ సభ్యులు జి రాములు మాట్లాడుతూ బాగ్‌లింగంపల్లి ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్‌లో గత మూడు నెలలుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. దీనిపై అనేకమార్లు జలమండలి అధికారులకు వినతిపత్రాలు ఇచ్చి ఫిర్యాదు చేసినా ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఒకవైపు రాష్ట్రంలో ప్రాజెక్టులు, భూగర్భజలాలు నిండుకున్నాయని, కానీ హైదరాబాద్ వాసులకు మాత్రం తాగునీరు కరువైందని ఆన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం డీజీఎం వాహెబ్, సెక్షన్ మేనేజర్ జ్యోతి లకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రామ్‌నగర్ డివిజన్ కమిటీ నాయకులు రమేష్, వెంకటయ్య, బీజేపీ నాయకులు కరణం బాబు, బస్తీవాసులు సుగుణ, రేణుక, రాణి, పద్మ, మనీ, పెంటు బారు, అంకమ్మ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.