Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరా లక్ష్మీనా రాయణ అన్నారు. మంగళవారం గోధుమకుంట గ్రామం లో మండల ప్రజా పరిషత్ నిధులు రూ.3 లక్షలతో చేపడుతున్న భూగర్భ మురికి కాల్వ నిర్మాణ పనులను సర్పంచ్ ఆకిటి మహేందర్‌రెడ్డితో కలిసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి మండల పరిషత్ నుంచి నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సోమని ఆంజనేయులు, ఎంపీటీసీ మంచాల కిరణ్ జ్యోతి, ప్రవీణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి పి.సుభాషిని, వార్డు సభ్యులు పుట్ట బాలరాజుగౌడ్, చీర శేఖర్, చీర రజిత, సామల ప్రేమ్నాద ¸్రెడ్డి తాండూరి సంధ్య, నాచారం పద్మ, మంచాల స్వరూప, జంగం శివ యాదవ్, కో-ఆప్షన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.