Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
సనత్‌నగర్ నియోజకవర్గం బంసిలాల్పేట్ డివిజన్ అమాయకులైన పేద ప్రజలకు ఇల్లు కట్టి ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ నాయకులు డబుల్ బెడ్ రూం ఇండ్లను అమ్ముకుంటున్నారని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. బండ మైసమ్మ నగర్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం కేటాయింపులకు సంబంధించి రెవెన్యూ అధికారులు మంగళవారం సందర్శించారనీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉత్సాహం ఆశీస్సులతో అధికార టీఆర్ఎస్ నాయకులు అనవసరంగా జోక్యం చేసుకోవడంతో చాలా అక్రమాలు జరిగాయని తెలిపారు. ఐడీహెచ్ కాలనీ మొదట డబుల్ బెడ్ రూం పథక ఇండ్లు మొదటి ఉదాహరణ అనీ, మొత్తం 36 అనర్హులకు కేటాయించారనీ, దీనిపై అప్పటి కలెక్టర్ రాహుల్ బొజ్జా దృష్టికి తీసుకెళ్లగా, సమగ్ర విచారణకు ఆదేశించారనీ, వెరిఫికేషన్ అనంతరం 36 మంది ఆధీనంలో ఉన్న వారందరినీ తొలగించి ఇండ్లకు సీజ్ చేశారని తెలిపారు. స్థానిక కార్పొరేటర్ భర్త కుర్మా లక్ష్మిపతి అండ దండలతో జగదీశ్ అనే వ్యక్తి తనను తాను మురికి వాడ అధ్యక్షునిగా చెప్పుకుని రూ.లక్షలు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయనీ, శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ జగదీష్‌కు రూ.2 లక్షలు ఎలా ఇచ్చాడు అనే వీడియో కూడా వైరల్‌గా మారిందనీ, దీనిపై రెవెన్యూ పోలీస్ అధికారులతో సమగ్ర విచారణ జరిపించి నిజానిజాలు బయటపెట్టాలని మర్రి శశిధర్ రెడ్డి కోరారు.