Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
మౌలాలి డివిజన్లోని మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవి కాంత్, జిల్లా ఎక్సైజ్ సూపరింటె ండెంట్ అరుణ్ కుమార్ విలేకర్ల సమావేశంలో కొత్త మద్యం షాపుల విధివిధానాలను తెలియజేశారు. మల్కా జిగిరి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో మొత్తం 88 దుకాణాలకు టెండర్లు పిలువనున్నట్టు తెలిపారు. ఇందులో 20 దుకాణాలు రిజర్వేషన్ల కింద గౌడ్స్ 12, ఎస్సీకి 7, ఎస్టీకి 1, జనరల్‌కు 68 కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 9నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు వారు తెలిపారు. ఈ దరఖాస్తులు కెవిఆర్.కన్వెన్షన్ హాల్, కొంపల్లి నందు స్వీకరించి ఈ నెల 20వ తేదీన జిల్లా కలెక్టర్ సమక్షంలో టెండర్లు ఓపెన్ చేస్తామని తెలిపారు.